CoWin Vaccine Certificates: పుట్టిన తేదీ ఉంటేనే విదేశాలకు పయనం

26 Sep, 2021 10:12 IST|Sakshi

వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌లో పుట్టిన తేదీ ఉంటేనే విదేశాలకు పయనం

న్యూఢిల్లీ: కోవిడ్‌-19 మొదటి, రెండు డోసులు తీసుకోవడమే కాక కోవిడ్‌ వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌లో కూడా పుట్టిన తేదీ నమోదు చేసుకుంటేనే విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుందని నేషనల్‌ హెల్త్‌ అథారిటీ (ఎన్‌హెచ్‌ఏ) చీఫ్‌ డీఆర్‌ శర్మ స్పష్టం చేశారు. అంతేకాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పుట్టిన తేదీకి ఒక ఫార్మాట్‌ (సంవత్సరం\ నెల\ తేదీ) విధానాన్ని కూడా సూచించింది. ఇప్పుడిప్పుడే వ్యాపారాలు, దుకాణలు, కార్యాలయాలు నెమ్మదిగా తెరుచుకుని యథావిధిగా కొనసాగుతున్నాయని పేర్కొంది.

(చదండి: సైకిల్‌పై దుస్తులమ్ముకునే వ్యక్తి కొడుకు.)

ఈ క​మంలో ప్రయాణికులు సురక్షితంగా ఏమాత్రం ఒత్తిడికి గురవ్వకుండా ప్రయాణించాలంటే ఈ విధమైన నిబంధనలే సురక్షితమని చెప్పారు. ఒకవేళ రెండు డోసులు వేయించుకున్నప్పటికీ పుట్టిన తేదీ నమోదు చేయించుకోకపోతే వెంటనే మీ పాస్‌పోర్ట్‌లో పుట్టిన తేదీలో ఎలా ఉందో అలా కోవిడ్‌ వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌లో మార్పులు చేయించుకోవాలని డీఆర్‌ శర్మ సూచించారు.

పుట్టిన సంవత్సరం ఆధారంగా సదరు వ్యక్తుల వయసు కూడా స్పష్టమవుతోందని తెలిపారు. ఎన్నో అభ్యంతర పరిణామాల మధ్య యూకే తయారు చేసిన కోవిషీల్డ్‌​కి గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే.

(చదవండి: వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌: కంపెనీల కొత్త వ్యూహం)

మరిన్ని వార్తలు