టీనేజర్‌కు బెయిల్‌ నిరాకరించిన సుప్రీం

3 Sep, 2020 09:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గుర్గావ్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 7 ఏళ్ల బాలుడిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీనేజర్‌ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. జస్టిస్ ఆర్‌ఎఫ్ నరిమన్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం పంజాబ్- హర్యానా హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. కేసును విచారించిన న్యాయమూర్తులు ‘పిటిషనర్‌ తరుపు వాదనలు అన్ని మేం విన్నాం. హైకోర్టు ఇచ్చిన తీర్పులో కలగజేసుకోవడానికి మాకు ఏ కారణం కనిపించడంలేదు. అందుకే ఈ కేసును కొట్టి వేస్తున్నాం’ అని పేర్కొన్నారు.

నిందితుడి బెయిల్ పిటిషన్‌ను జూన్‌లో పంజాబ్-హర్యానా హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్‌ను పెద్దవాడిగా పరిగణిస్తూ కోర్టు అతనికి ఎలాంటి ఉపశమనాన్ని ఇవ్వడానికి మొగ్గు చూపలేదు.  2019 ఫిబ్రవరి 28 నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుని, నిందితుడి బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 12 కింద పిటిషనర్‌కు ఉపశమనం లభిస్తుందో లేదో తెలుసుకోవడానికి కోర్టుకు తక్కువ అవకాశం ఉంది అని హైకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. 2017 సెప్టెంబర్‌ 8 న పరీక్షలను వాయిదా వేయించాలని ఒక టీనేజర్‌ 7 ఏళ్ల బాలుడిని హత్య చేశాడు. ఈ విషయాలను సీబీఐ తన చార్జిషీట్‌లో పేర్కొంది. కేసు విచారిస్తున్న సీబీఐ బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకించింది. నిందితుడు ఎటువంటి సానుభూతికి అర్హుడు కాదని పేర్కొంది. 

చదవండి: రేప్‌ కేసు: అతడే ప్రధాన నిందితుడు!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు