అదానీ గ్రూప్‌పై ఆధారాలున్నాయా?

25 Nov, 2023 06:20 IST|Sakshi

సీనియర్‌ లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్‌కు సుప్రీంకోర్టు ప్రశ్న  

న్యూఢిల్లీ: విదేశీ రిపోర్టులను సాక్ష్యాధారాలుగా పరిగణించలేమని, అందులోని అంశాలను స్వచ్ఛమైన నిజాలుగా భావించలేమని సుప్రీంకోర్టు తేలి్చచెప్పింది. భారత్‌కు చెందిన అదానీ గ్రూప్‌ ఇద్దరు విదేశీ ఇన్వెస్టర్ల ద్వారా ఇన్‌సైడర్‌ ట్రేగింగ్‌కు పాల్పడిందని ఆరోపిస్తూ ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్టు (ఓసీసీఆర్‌పీ) అనే విదేశీ స్వచ్ఛంద సంస్థ ఓ నివేదిక విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అమెరికా బిలియనీర్‌ జార్జి సోరోస్‌ ఈ సంస్థను స్థాపించారు. ఈ నివేదిక వెలువడిన నేపథ్యంలో.. అక్రమాలకు పాల్పడిన అదానీ గ్రూప్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు వ్యక్తులు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు.

వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ హాజరయ్యారు. ‘‘విదేశీ నివేదికలను కచి్చతంగా నిజాలుగా ఎందుకు స్వీకరించాలి? ఓసీసీఆర్‌పీ నివేదికను మేము తోసిపుచ్చడం లేదు. కానీ, అదానీ గ్రూప్‌ అక్రమాలకు పాల్పడినట్లు సాక్ష్యాధారాలు కావాలి. అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా మీ దగ్గరున్న ఆధారాలేమిటి?’’ అని ప్రశాంత్‌ భూషణ్‌ను ప్రశ్నించింది.

మరిన్ని వార్తలు