ఆ రోజు నుంచి ప్లాస్టిక్‌ ఉండదు

24 Jul, 2021 01:46 IST|Sakshi

న్యూఢిల్లీ: 2022 జనవరి 1 నుంచి ప్లాస్టిక్‌ ఉపయోగాన్ని క్రమంగా తగ్గించే దిశగా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్‌ను వచ్చే ఏడాది ప్రారంభం నుంచి కనిపించకుండా చేసేలా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందిన కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే పార్లమెంటుకు తెలిపారు.

ప్లాస్టిక్‌ పుల్లలు ఉన్న ఇయర్‌ బడ్స్, బెలూన్‌ స్టిక్స్, ప్లాస్టిక్‌ జెండాలు, క్యాండీ పుల్లలు, ఐస్‌ క్రీమ్‌ పుల్లలు, డెకరేషన్‌ చేసేందుకు ఉపయోగించే పాలీస్టైరిన్‌లు జనవరి 1 నాటికి ఉపయోగించకుండా చూసే ప్రక్రియ సాగుతోందని అన్నారు. ఒక్కసారి మాత్రమే ఉపయోగిస్తూ,120 మైక్రాన్ల మందం కంటే తక్కవ ఉండే రీసైకిల్డ్‌ క్యారీ బ్యాగులను ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి మార్కెట్‌లో అందుబాటులో లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.   

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు