పొదుపు సంఘాల మహిళలకు కేంద్రం తీపికబురు

15 Aug, 2021 20:06 IST|Sakshi

పొదుపు సంఘాల మహిళలకు కేంద్రం తీపికబురు అందించింది. స్వయం సహాయక బృందాలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడానికి ప్రభుత్వం ఈ కామర్స్ వేదికలను ఏర్పాటు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తెలిపారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. "స్వయ సహాయ బృందాలలో 8 కోట్ల మందికి పైగా మహిళలు ఉన్నారు. వారు కొత్త కొత్త ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. దేశ, విదేశాల్లో మార్కెటింగ్ కల్పించడానికి ప్రభుత్వం వారి ఉత్పత్తుల కోసం ఈ-కామర్స్ వేదికను సిద్ధం చేస్తుంది" అని అన్నారు.

'వోకల్ ఫర్ లోకల్' నినాదంతో దేశం ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం మనందరి బాధ్యత. "ప్లాస్టిక్ రహిత భారతదేశం కోసం మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా ఆపివేస్తేనే నిజం అవుతుంది" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. "ఈ రోజు గ్రామాలు వేగంగా అభివృద్ది చెందుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు, విద్యుత్ వంటి సౌకర్యాలు గ్రామాల చెంతకు చేరుతున్నాయి. నేడు ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ గ్రామాలకు సరికొత్త శక్తిని అందిస్తోంది" అని అన్నారు.

మరిన్ని వార్తలు