ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ VS సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్

15 Aug, 2021 19:12 IST|Sakshi

75వ స్వాతంత్ర్య దినోత్సవం సంధర్భంగా ఓలా ఎలక్ట్రిక్, సింపుల్ ఎనర్జీ తమ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల ఫీచర్స్ చూడాటానికి చాలా దగ్గరగా ఉన్నాయి. ఏదేమైనా, ఓలా ఎలక్ట్రిక్, సింపుల్ ఎనర్జీ రెండు ఈవీ ప్రపంచంలో ఒకదానితో మరొకటి పోటీపడనున్నాయి. ఓలా ఈ-స్కూటర్ ను కేవలం రూ.499కు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. సింపుల్ వన్ స్కూటర్ ను కూడా రూ.1947 చెల్లించి ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే భారత దేశంలోని 1,000కు పైగా నగరాల నుంచి బుకింగ్ల రూపంలో అపారమైన స్పందనను పొందింది. 

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో 18 నిమిషాల పాటు చార్జ్ చేస్తే 75 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు అని ఓలా వెల్లడించింది. ఇక సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ లూప్ ఛార్జర్ సహాయంతో 1 నిమిషం చార్జ్ చేస్తే 2.5 కిలోమీటర్ల రేంజ్ వరకు వెళ్లనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ రెండు స్కూటర్ల మిగతా ఫీచర్స్ గురుంచి ఈ క్రింద తెలుసుకోండి.

 Simple One  Ola S1 Pro
Top Speed  105 Kmph  115 Kmph
Range  236 KM  181 KM
Acceleration(0 - 40 KM)  2.95 Secs  3 Secs
Torque  72 Nm  58 Nm
Battery Capacity  4.8 KWh  3.97 KWh
Boot Space  30L  36L
Price  ₹1.10 lakhs  ₹1.30 lakhs

‎ఈ రెండు స్కూటర్లు కూడా వాటికి అవే స్వంత ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నాయి. ఇప్పటి వరకు, మనకు తెలిసిన వివరాలతో విజేతను ఎంచుకోవడం కష్టం కాబట్టి పూర్తి స్థాయిలో రోడ్ల మీదకు వచ్చాక ఏది ఉత్తమం అనేది తెలుస్తుంది. అయితే, రెండు ఈ-స్కూటర్లు బజాజ్ చేతక్, ఏథర్ 450X, TVS iQube వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లతో మార్కెట్‌లో పోటీ పడనున్నాయి.

మరిన్ని వార్తలు