ముస్లిం సోదరులకు ప్రధాని మోదీ రంజాన్‌ శుభాకాంక్షలు

14 May, 2021 10:34 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం  రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారిని అధిగమించి మానవ సంక్షేమాన్ని మరింత  పెంపొందించేలా కృషి చేద్దామని కోరారు. ‘ఈద్‌ ఉల్‌ పితర్‌ సందర్భంగా ఈద్‌ ముబారక్‌. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఉండాలని ప్రార్థిస్తున్నాను. మనందరి సమిష్టి కృషితో కరోనా మహమ్మారిని అధిగమించి ముందుకు వెళ్లేలా కృషి చ్దేదాం' అంటూ మోదీ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు