Rajasthan Election Result 2023: గహ్లోత్‌ మేజిక్‌కు తెర!

4 Dec, 2023 05:15 IST|Sakshi

అధికార పార్టీ ఓడే ఆనవాయితీ

రాజస్తాన్‌లో పునరావృతం

రాజస్తాన్‌లో ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఈసారి ‘మేజిక్‌’ చేయలేకపోయారు. మెజీíÙయన్ల కుటుంబం నుంచి వచి్చన ఆయన, ఈసారి కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపించేందుకు శాయశక్తులా ప్రయతి్నంచారు. ఆ క్రమంలో సంక్షేమ, ప్రజాకర్షక పథకాలతో సహా అందుబాటులో ఉన్న ట్రిక్కులన్నీ ప్రయోగించినా లాభం లేకపోయింది. అధికార పార్టీని ప్రజ లు ఇంటికి సాగనంపే 30 ఏళ్ల ఆనవాయితీ అప్రతిహతంగా కొనసాగింది. దాంతో కాంగ్రెస్‌ పరా జయం చవిచూసింది. ‘‘సీఎం పదవిని వదిలేయా లని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. కానీ సీఎం పదవే నన్ను వదలడం లేదు’’ అని పదేపదే గొప్ప గా చెప్పుకున్న 72 ఏళ్ల గహ్లోత్‌ చివరికి ఓటమిని అంగీకరించి ఆ పదవిని వీడాల్సి వచ్చింది.

ఏ పథకమూ ఆదుకోలేదు...
గతేడాది కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలు గహ్లోత్‌ రాజకీయ జీవితానికి పెద్ద అగి్నపరీక్షగా మారాయి. సీఎంగిరీని విడిచి పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరించాలన్న అధిష్టానం ఆదేశాలను ధిక్కరించడం ద్వారా పెను సాహసమే చేశారాయన. ఆ క్రమంలో సోనియా, రాహుల్‌గాంధీ ఆగ్రహానికి గురైనా వెనకాడలేదు. చివరికి అధిష్టానమే వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి కలి్పంచారు. ఈ దృష్ట్యా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎలాగైనా గెలిపించకపోతే తన రాజకీయ జీవితమే ప్రమాదంలో పడుతుందని గ్రహించి దూకుడు ప్రదర్శించారు.

అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ వాడుకున్నారు. ఎన్నికలకు ఏడాది ముందునుంచే పుంఖానుపుంఖాలుగా పలు సంక్షేమ, ప్రజాకర్షక పథకాలకు తెర తీశారు. పేదలకు కారుచౌకగా వంట గ్యాస్‌ మొదలుకుని ప్రజలకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా దాకా ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నింటికీ మంచి పేరే వచి్చంది. ఏం చేసినా చివరికి ప్రజల మనసును మార్చలేక, అధికార పార్టీని ఓడించే ‘ఆనవాయితీ’ని తప్పించలేక చతికిలపడ్డారు.

దెబ్బ తీసిన విభేదాలు...?
యువ నేత సచిన్‌ పైలట్‌తో విభేదాలు కూడా రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ అవకాశాలను దెబ్బ తీశాయనే చెప్పాలి. ముఖ్యంగా 30కి పైగా అసెంబ్లీ స్థానాల్లో నిర్ణాయక శక్తిగా ఉన్న గుజ్జర్లు తమ వర్గానికి చెందిన పైలట్‌కు కాంగ్రెస్‌లో అన్యాయం జరుగుతోందన్న భావనకు వచ్చారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా కూడా పార్టీని దెబ్బ తీసిన అంశాల్లో ఒకటని పరిశీలకులు చెబుతున్నారు. ఎన్నికల వేళ గహ్లోత్‌కు పైలట్‌ నిజానికి పెద్దగా సహాయ నిరాకరణ చేయలేదు. పైపెచ్చు స్నేహ హస్తమే సాచారు. కానీ గహ్లోత్‌ మాత్రం తానేంటో అధిష్టానానికి నిరూపించుకోవాలన్న ప్రయత్నంలో పైలట్‌కు ప్రాధాన్యం దక్కకుండా చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించి కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చిన పైలట్‌ను అలా పక్కన పెట్టడం కూడా పార్టీకి చేటు చేసింది.     

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

>
మరిన్ని వార్తలు