బార్డర్‌ దాటడానికి వెనకాడం: రాజ్‌నాథ్‌ వార్నింగ్‌

23 Apr, 2022 20:34 IST|Sakshi
(ఫైల్‌ ఫొటో)

గుహవాటి(గౌహాతి): ఉగ్రవాద చర్యలతో దేశ సరిహద్దు బయట నుంచి భారత్‌ను టార్గెట్‌ చేస్తే.. తాము సైతం సరిహద్దులు దాటడానికి వెనకాడబోమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఆయన శనివారం 1971 ఇండియా-పాకిస్తాన్‌ యుద్ధంలో పాల్గొన్న మాజీ అసోం వెటరన్స్‌ సన్మానసభలో పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని అంతమొందించడంలో భారత​ దీటూగా వ్యవహరిస్తుందన్న సందేశాన్ని ప్రపంచదేశాలకు చెప్పడంలో విజయవంతమయ్యామని తెలిపారు.

ఉగ్రవాదలు సరిహద్దు బయట నుంచి భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం.. భారత్‌ సైతం బార్డర్‌ దాటడానికి వెనకడుగు వేయదని రాజ్‌నాథ్‌ సింగ్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. అయితే దేశ పశ్చిమ సరిహద్దుతో పోల్చితే.. తూర్పు సరిహద్దులో శాంతి, స్థిరత్వం నెలకొందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ స్నేహపూర్వక పొరుగు దేశమని అందుకే తూర్పు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు లేవని తెలిపారు.

ఈశాన్య ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుంచి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ)ను కేంద్రం ఇటీవల ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. శాంతి పరిస్థితులు మెరుగుపడినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటుందని పేర్కొన్నారు. ఏఎఫ్‌ఎస్‌పీఏ అమల్లో ఉండాలని సైన్యం కోరుకుంటుందనటం ఒక అపోహని ఆయన స్పష్టం చేశారు.

చదవండి: Hanuman Chalisa Row: ముంబైలో హైడ్రామా.. ఎంపీ నవనీత్‌ కౌర్‌ అరెస్ట్‌, పోలీసులతో వాగ్వాదం, ఆపై ఫిర్యాదు
 

మరిన్ని వార్తలు