బయటపడ్డ అరుదైన బ్లాక్‌ ఫంగస్‌ కేసులు

22 May, 2021 18:12 IST|Sakshi
చిన్న ప్రేగుకు సోకిన బ్లాక్‌ ఫంగస్‌

న్యూఢిల్లీ : ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంటే.. మరో వైపు బ్లాక్‌ ఫంగస్‌(మ్యూకోర్‌ మైకోసిస్‌) కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఇది తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా, దేశ రాజధాని న్యూఢిల్లీలో అరుదైన బ్లాక్‌ ఫంగస్‌ కేసులు రెండు బయటపడ్డాయి. శనివారం కరోనా వ్యాధిగ్రస్తుల చిన్న ప్రేగులో బ్లాక్‌ ఫంగస్‌ను గుర్తించారు వైద్యులు. కరోనా బారిన పడిన ఓ 56 ఏళ్ల వ్యక్తి గత కొద్దిరోజులుగా కరోనాకు చికిత్స పొందుతున్నాడు. మూడు రోజుల క్రితం అతడి కడుపులో నొప్పి ప్రారంభమైంది. దీంతో గ్యాస్ట్రిక్‌ ప్రాబ్లమ్‌గా భావించిన అతడు సంబంధిత మందులు వాడి ఊరుకున్నాడు. సరైన వైద్యం తీసుకోకుండా మూడు రోజుల పాటు నొప్పిని నిర్లక్ష్యం చేశాడు. నొప్పి తగ్గకపోవటంతో సర్‌ గంగారామ్‌ హాస్పిటల్‌కు వచ్చాడు.

దీంతో అతడికి సిటీ స్కాన్‌ చేయగా చిన్న ప్రేగులో రంధ్రాలు ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా కరోనా ముదిరి ఆరోగ్య పరిస్థితి విషమించింది. 68 ఏళ్ల మరో పేషంట్‌ చిన్న ప్రేగులోనూ అలాంటి రంధ్రాలను గుర్తించారు వైద్యులు. వాటిపై పరీక్షలు నిర్వహించగా ఇద్దరి చిన్న ప్రేగులకు బ్లాక్‌ ఫంగస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. కాగా, ఇద్దరికీ కరోనాతో పాటు డయాబెటీస్‌ ఉంది. ఇద్దరిలోనూ ఒకే లక్షణాలు కనిపించాయి.

చదవండి : తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. రామ్‌దేవ్‌పై చర్యలు తీసుకోండి!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు