ఇదేందయ్యా ఇది: జైలులో గది అద్దెకు ఇస్తారంటా.. రెంట్‌ ఎంతో తెలుసా?

1 Oct, 2022 15:14 IST|Sakshi

జైలులో ఎవరుంటారు.. ఈ ప్రశ్న చిన్నపిల్లలను అడిగినా వెంటనే చెప్పేస్తారు. జైలులో నేరస్తులు ఉంటారు అని. అయితే, ఉత్తరాఖండ్‌లోని జైలులో మాత్రం నేరం చేయకపోయినా.. అక్కడ ఉండొచ్చు. ఎన్ని రోజులైనా అక్కడ నివాసం ఉండవచ్చు. ఎలా అనుకుంటున్నారా?.

వివరాల ‍ప్రకారం.. ఉత్తరాఖండ్‌లోని హల్ద్ వానీ జైలులో దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడి జైల్లో నేరం చేయని వారు సైతం ఉండొచ్చు. అయితే, జైలులోని ఒక రూమ్‌లో ఉండేందుకు ఒక రోజు అద్దెగా రూ.500 చెల్సించాల్సి ఉంటుంది. కాగా, ఒక్క రోజుకు రూ.500 చొప్పున చెల్లిస్తూ ఎన్ని రోజలైనా జైలులో ఉండొచ్చు అని జైలు సూపరింటెండెంట్‌ తెలిపారు. అయితే, ఇందుకు ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. 

కాగా, కొందరు వ్యక్తులు జాతకాలను బాగా నమ్ముతుంటారు. జాతకాల్లో దోషం కారణంగా పెళ్లిళ్లు కాకపోవడం, ఉద్యోగాలు సాధించకపోవడం, అనుకున్నది చేయలేకపోవడం వంటివి జరుగుతుంటాయని వారి నమ్మకం. ఇందుకోసం దోష నివారణ చేయడానికి కొన్ని పనులు చేస్తుంటారు. ఇందులో భాగంగానే జైలుకు సైతం వెళ్లి రావాలని కొందరి జాతకాల్లో ఉంటుంది కదా.. అందుకోసం ఇలాంటి సమస్య ఉన్నవారి కోసం బంధన్‌ యోగ్‌ పేరిట ఇలా ప్రత్యేకంగా జైలులో రూమ్స్‌ అద్దెకు ఇస్తున్నట్టు జైలు అధికారులు స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు