శబరిమల యాత్ర నిలిపివేత.. జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ

20 Nov, 2021 17:04 IST|Sakshi

కొచ్చి: కేరళలో భారీ వర్షాలు కురవడంతో శబరిమల యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు స్థానిక జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పంబా నది ఉప్పొంగుతోంది. దీంతో నది డ్యామ్ వద్ద రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో భక్తుల భద్రతరీత్యా శబరిమల యాత్ర కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత సమీప స్లాట్‌లో దర్శన అవకాశం కల్పిస్తామని అధికారులు చెప్పారు.

చదవండి: దేశంలోనే తొలి స్థానంలో ఇండోర్‌.. విజయవాడకు మూడోస్థానం

మరిన్ని వార్తలు