ప్రాణం తీసిన శానిటైజర్‌

9 Jul, 2021 10:28 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులో తిరుచ్చి ఈబీ రోడ్డుకు చెందిన బాలమురుగన్‌ కుమారుడు శ్రీరాం (13) స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. బుధవారం  మిత్రులు వంటావార్పుతో సహపంక్తి భోజనం ఆటకు సిద్ధమయ్యారు. మిత్రులు వారి వారి ఇళ్ల నుంచి తెచ్చిన పప్పు, బియ్యం, కూరగాయలను పాత్రలో వేసి పొయ్యి మీద పెట్టారు. ఇంట్లో నీలం రంగులో ఉన్న ద్రవాన్ని కిరోసిన్‌గా భావించిన బాలుడు శ్రీరాం ఆ మంటల మీద పోశాడు. క్షణాల్లో ఆ మంటలు బాలుడిని చుట్టుముట్టాయి. మిత్రుల కేకలు విన్న ఇరుగు పొరుగు వారు వచ్చి మంటలు ఆర్పారు. అప్పటికే శ్రీరాం శరీరం 90 శాతం మేర కాలిపోయింది. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలుడు మృతిచెందాడు. కిరోసిన్‌ అనుకుని శానిటైజర్‌ను పొయ్యిలో పోయడం, ఆ బాటిల్‌ చేతిలోనే ఉండటంతో మంటలు చుట్టుముట్టినట్టు విచారణలో తేలింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు