రాహుల్‌ గాంధీ అనర్హత వేటుపై ఘాటుగా స్పందించిన శరద్‌ పవార్‌

25 Mar, 2023 14:54 IST|Sakshi

కాంగ్రెస్‌నేత, ఎంపీ రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో పలువురు తమదైన శైలీలో స్పందించి రాహుల్‌కి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌ సైతం దీన్ని వ్యతిరేకించారు. ఇది రాజ్యంగంలోని ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధమని, ప్రజాస్వామ్య విలువలు పడిపోవడాన్ని ప్రతిబింబిస్తోందంటూ మండిపడ్డారు. దీన్ని ఖండించదగిన చర్య అని విరుచుకుపడ్డారు.

ఆయన శుక్రవారం జరిగిన పరిణామంపై వ్యాఖ్యానిస్తూ..హత్యాయత్నం కేసులో దోషిగా తేలిన లక్ష్యద్వీప్‌కు చెందన తన పార్టీ ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌ పీపీపై అనర్హత వేటు వేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అప్పుడూ కూడా ఫైజల్‌పై విధించిన శిక్షను కేరళ హైకోర్టు సస్పెండ్‌ చేసిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలో లోక్‌సభలోని ఆ ఇద్దరు ఎంపీల గురించి మాట్లాడుతూ..కొన్ని నెలల క్రితం వరకు ఎంపీలుగా ఉన్న రాహుల్‌ గాంధీ, ఫైజల్‌లపై అనర్హత వేటు వేయడం రాజ్యంగంలోని ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధం అని అన్నారు.

ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని, ఇది ఖండించదగినదని అన్నారు. రాజ్యంగా సూత్రాలకు విరుద్ధంగా ఉందని సోషల్‌ మీడియాలో శరద్‌ పవార్‌ ట్వీట్‌ చేశారు. మన రాజ్యంగం ప్రతి వ్యక్తికి న్యాయం పొందే హక్కును ఇస్తోంది. ఆలోచనా స్వేచ్ఛ, హోదా, సమానత్వ హక్కు, తదితరాలు ప్రతి భారతీయుడి గౌరవానికి భరోసా ఇచ్చే సౌభ్రాతృత్వం అని కేంద్ర మాజీ మంత్రి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

(చదవండి: ప్రధాని కళ్లలో భయం చూశా: రాహుల్‌ గాంధీ)

మరిన్ని వార్తలు