-

వర్షంలో శరద్‌పవార్‌ స్పీచ్‌..సెంటిమెంట్‌ ఏంటంటే..

27 Nov, 2023 17:13 IST|Sakshi

ముంబై: నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) చీఫ్‌ శరద్‌పవార్‌ మళ్లీవర్షంలో తడుస్తూ స్పీచ్‌ ఇచ్చారు. నవీముంబైలో పార్టీ బహిరంగసభ జరుగుతున్నపుడు చిరుజల్లులు పడ్డాయి. ఈ వర్షంలోనే పవార్‌ తన ప్రసంగాన్నికంటిన్యూ చేశారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే వర్షంలో తడుస్తూ పవార్‌ చేసిన ప్రసంగం వెనుక ఒక సెంటిమెట్‌ ఉంది.

2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సతారా నియోజకవర్గంలో పవార్‌ ప్రచారం నిర్వహిస్తున్నారు. పవార్‌ ప్రసంగిస్తుండగానే బోరున వర్షం పడింది. పక్కనున్న పార్టీ వ్యక్తి ఒకతను గొడుగు తీసుకురాగా పవార్‌ వద్దన్నారు. 83 ఏళ్ల పవార్‌ భారీ వర్షంలోనే తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ ఫొటోలు, వీడియోలు అప్పట్లో ఎన్నికల సందర్భంగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఆ ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం వెనుక ఈ ఫొటోల పాత్ర కూడా ఉందని చాలా మంది భావిస్తుంటారు. అందుకే మళ్లీ పవార్‌ వర్షంలో స్పీచ్‌ ఇవ్వడంపై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. 

‘మన ప్లాన్‌ను ఇక్కడ వర్షం డిస్ట్రబ్‌ చేసింది. అయినా మనం వెనుకడుగువేసే వాళ్లం కాదు. అంత ఈజీగా మనం దేనికి లొంగేవాళ్లం కాదు. భవిష్యత్తులోనూ మనం మన పోరాటాన్ని కొనసాగించాలి’ అని నవీముంబై సభలో శరద్‌పవార్‌ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు తన మేనల్లుడు అజిత్‌ పవార్‌ను ఉద్దేశించి చేసినవేననే ప్రచారం జరుగుతోంది. 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఎన్సీపీని చీల్చి బీజేపీ-శివసేన సంకీర్ణ ప్రభుత్వంలో చేరిన అజిత్‌ పవార్‌ ప్రస్తుతం మహారాష్ట్ర  డిప్యూటీసీఎంగా ఉన్న విషయం తెలిసిందే. అక్కడితో ఆగకుండా ఎన్సీపీ పార్టీ, సింబల్‌ కూడా తనవేనని ఆయన ఎన్నికల కమిషన్‌లో క్లెయిమ్‌ చేశారు.  

ఇదీచదవండి...క్లాస్‌మేట్‌ను 108సార్లు పొడిచారు..కారణమిదే..

మరిన్ని వార్తలు