97 నుంచి 77 కట్‌ చేస్తే... ఆ కరేజ్‌ ఇలా ఉంటుంది!

26 Nov, 2023 00:52 IST|Sakshi

వైరల్‌

97 సంవత్సరాల వయసులో రెండు అడుగులు వేగంగా వేయాలంటేనే కష్టం. అలాంటిది ‘పారా మోటరింగ్‌ అడ్వెంచర్‌’ చేస్తే... మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన ఉషా తూసే 97 సంవత్సరాల వయసులో  పారామోటరింగ్‌ సాహసం చేసి నెటిజనులు ‘వావ్‌’ అనేలా చేసింది. ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో 1.2 మిలియన్‌ల వ్యూస్‌ను దక్కించుకుంది.
 
ఆర్మీ పారా–కమాండో పైలట్స్, ఎయిర్‌ ఫోర్సు వెటరన్స్‌ ఆపరేట్‌ చేసే ఫ్లైయింగ్‌ రైనో పారామోటరింగ్‌ విభాగం బామ్మ చేత ఈ సాహసాన్ని చేయించింది. ‘97 ఇయర్‌ వోల్డ్‌ కరేజ్‌ అండ్‌ 20 ప్లస్‌ ఇయర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌పీరియన్స్‌’ అనే కాప్షన్‌తో ‘ఎక్స్‌’లో ఈ వీడియో క్లిప్‌ను పోస్ట్‌ చేసింది.

‘సాహసంలో జీవనోత్సాహం కూడా ఉంటుంది అనే వాస్తవాన్ని ఆవిష్కరించే వీడియో ఇది’. ‘ఎంతోమందిని ఇన్‌స్పైర్‌  చేసే వీడియో’.... ఇలాంటి కామెంట్స్‌ ఎన్నో కనిపించాయి
నిజానికి ఉషాకు సాహసం కొత్త కాదు. భర్త ఆకస్మిక మరణం, పిల్లల బరువు బాధ్యతల సమయంలో కూడా ఆమె డీలా పడిపోలేదు. ఒంటి చేత్తో కుటుంబాన్ని ధైర్యంగా పోషించింది.

మరిన్ని వార్తలు