Smoke In Cabin: స్పైస్‌జెట్‌ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ 

2 Jul, 2022 10:01 IST|Sakshi

సాక్షి,ఢిల్లీ: ప్రైవేటురంగ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన విమానంలో పొగలు అలుముకోవడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. అయితే సిబ్బంది వెంటనే అప్రమత్త మయ్యారు. తక్షణమే విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్‌ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  

ఢిల్లీ నుంచి జబల్‌పూర్‌కు వెళుతున్న విమానంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం గాల్లోకి ఎగిరి, సుమారు 5వేల అడుగుల ఎత్తుకు చేరిన తరువాత  క్యాబిన్‌లో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీన్ని గమనించిన పైలట్లు,  సిబ్బంది వెంటనే  విమానాన్ని తిరిగి ఢిల్లీ విమానాశ్రయానికి మళ్లించారు. దీంతో ప్రమాదం తప్పింది.  ప్రయాణీ కులందరూ సురక్షితంగా ఉన్నారని స్పైస్‌జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించింది.

మరిన్ని వార్తలు