ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్‌

2 Aug, 2020 14:21 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం ఆ‍స్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం జూలై 30 గురువారం రోజున న్యూఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయినట్లు​ ఆస్పత్రి చైర్మన్‌ డీఎస్‌ రాణా తెలిపారు. దేశంలో రాజకీయ పరిస్థితులు, కరోనా మహమ్మారి ప్రభావం గురించి చర్చించడానికి సోనియా గాంధీ గురువారం తన పార్టీ రాజ్యసభ సభ్యులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా కాంగ్రెస్ అగ్ర నాయకులు పాల్గొన్నారు. కాగా.. గత ఫిబ్రవరి నెలలో కడుపు నొప్పి కారణంగా ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. (ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు