State Bank Day: హ్యపీ, ఇన్‌క్రెడిబుల్‌ జర్నీ

1 Jul, 2021 17:10 IST|Sakshi

సాక్షి ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేడు (జూలై 1) తన వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తన అద్భుతమైన జర్నీపై ట్విటర్‌  ద్వారా ఒక వీడియోను షేర్‌చేసింది. పురోగతి దిశగా దేశంతో కలిసి పయనించడం గర్వంగా ఉందంటూ ట్విట్‌ చేసింది.అధునిక అవసరాలకు ధీటుగా సరికొత్త డిజిటల్ బ్యాంకింగ్ సేవలతో దేశ ప్రజలకు సేవ చేయడం సంతోషంగానూ,  వినియోగదారుల ఆశలు, అంచనాలకనుగుణంగా ఇండియాతో పాటు దేశవిదేశాల్లో దూరప్రాంతాల్లో కూడా సేవలందించడం ఆనందంగా ఉందని వెల్లడించింది.  

24x7 సేవలు, కస్టమర్ల అచంచలమైన మద్దతుతో, #TheBankerToEveryIndian గా  నిలవడం గర్వంగా ఉందని తెలిపింది  ఈ సందర్భంగా  వినియోగదారులను తనకు  స్టేట్ బ్యాంక్ డే శుభాకాంక్షలు! అంటూ ట్విట్‌ చేసింది. ప్రపంచంలోనే 43వ అతిపెద్ద బ్యాంకు  ఎస్‌బీఐ. అంతేకాదు ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో 221 వ స్థానంలో ఉంది, ఈ జాబితాలో ఉన్న ఏకైక భారతీయ బ్యాంకుఇదే  కావడం విశేషం.

19వ శతాబ్దంలో 1806లో కోలకతాలో బ్యాంక్ ఆఫ్ కలకత్తాగా, ఆ తరువాత బ్యాంక్ ఆఫ్ బెంగాల్‌గా  అవతరించింది. పిదప  మూడు ప్రెసిడెన్సీ బ్యాంకుల విలీనంతో 1921 జనవరిలో ఇంపీరియల్ బ్యాంక్‌గా మారింది.  ఆ తరువాత జాతీయకరణలో 1955లో ఎస్‌బీఐగా రూపుదిద్దుకుంది. ఆధునిక సౌకర్యాలతో 1/4 వ మార్కెట్ వాటాతో, అతిపెద్ద ఇండియన్ బ్యాంక్ స్టేట్ బ్యాంకు. 22,000కి పైగా శాఖలు, 58,500 ఏటిఎంలు, 66వేల బీసీ అవులెట్లతో విస్తారమైన నెట్‌వర్క్ ద్వారా 44 కోట్లకు పైగా వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని చాటుతూ 32 దేశాలలో 233 కార్యాలయాల ద్వారా తన సేవలను విస్తరించుకుంది.  2021 మార్చి 31 నాటికి 245,652 మంది ఉద్యోగులతో ప్రపంచంలోనే అతిపెద్ద యజమానులలోఒకటిగా నిలిచింది. ఇందులో మహిళా ఉద్యోగుల ప్రాతినిధ్యం దాదాపు 26 శాతం. 2013, అక్టోబర్‌ 7న, అరుంధతి భట్టాచార్య బ్యాంకు చైర్‌పర్సన్‌గా నియమితులైన తొలి మహిళ కావడం మరో విశేషం.

మరిన్ని వార్తలు