State Bank Day: పీఎం కేర్స్ ఫండ్‌కు భారీ విరాళం

1 Jul, 2021 17:13 IST|Sakshi

కోవిడ్-19 మహమ్మారి ఇంకా కొనసాగుతున్న తరుణంలో దానిని అరికట్టడం కోసం దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)కు చెందిన సుమారు 2.50 లక్షల మంది ఉద్యోగులు ఎస్‌బీఐ 66వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పీఎం కేర్స్ ఫండ్ కు 62.62 కోట్ల రూపాయల మొత్తాన్ని విరాళంగా ఇచ్చినట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు పీఎం కేర్స్ ఫండ్ కు సహకారం అందించడం ఇది రెండవసారి.

"మా ఉద్యోగులు కరోనా మహమ్మారి కాలంలో కూడా మా ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలను అందించడం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గర్వకారణం. వారు సేవలు అందించడంలో ఎల్లప్పుడు ముందు ఉంటారు. అదనంగా, మహమ్మారిని అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్న సమయంలో వారు స్వచ్ఛందంగా ప్రధాని కేర్స్ ఫండ్ కు విరాళం ఇవ్వడానికి ముందుకు వచ్చారు" అని ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా తెలిపారు.

ఒక బాధ్యతాయుతమైన కార్పొరేట్ పౌరుడిగా, ఈ మహమ్మారి వల్ల ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం చేస్తున్న అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి ఎస్‌బీఐ కట్టుబడి ఉందని ఆయన అన్నారు. గత సంవత్సరంలో ఎస్‌బీఐ తన వార్షిక లాభంలో 0.25% కోవిడ్-19కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి మద్దతుగా అవసరమైన వారికి మాస్క్ లు, శానిటీసర్ల సరఫరా రూపంలో గణనీయమైన విరాళాలు కూడా ఇచ్చింది. అలాగే అదనంగా, ఎస్‌బీఐ ఉద్యోగులు ప్రధాని-కేర్స్ ఫండ్ కు రూ.107 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు.

చదవండి: సుకన్య సమృద్ధి, పీపీఎఫ్ పొదుపు పథకాల కొత్త వడ్డీ రేట్లు ఇవే!

మరిన్ని వార్తలు