కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 26 మంది బలవన్మరణం

28 Sep, 2023 14:02 IST|Sakshi

జైపూర్‌: పోటీ పరీక్షల హబ్‌గా పేరొందిన రాజస్థాన్‌ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజస్థాన్‌ కోటాకు వచ్చిన విద్యార్థి నీట్ పరీక్షల కోసం సొంతంగానే సన్నద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో కోటాలో ఆత్మహత్య చేసుకున్నాడు. తాజా మరణంతో ఈ ఏడాది 26 కేసులు కావడం గమనార్హం.

కేటాలో నీట్ సంబంధిత విద్యార్థుల మరణాలు ఇటీవల పెరిగిపోతున్నాయి. ఈ మరణాలను అరికట్టడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏ మాత్రం తగ్గడం లేదు. విద్యార్థులు నివసించే హాస్టళ్లకు జాలీలు కట్టడం, హ్యాంగింగ్ ఫ్యాన్లను వాడటం వంటి చర్యలు చేపట్టారు. విద్యార్థుల మానసిక స్థితిని మెరుకుపరచడానికి ప్రత్యేక తరగతులను కూడా నిర్వహిస్తున్నారు. అయినా విద్యార్థుల ఆత్మహత్యలు ఏ మాత్రం తగ్గడం లేదు.  

ఇదీ చదవండి: MS Swaminathan: ఎమ్‌.ఎస్ స్వామినాథన్ కన్నుమూత

మరిన్ని వార్తలు