మా సోదరులను రక్షిస్తాం!ఎవరైనా బెదిరిస్తే కాల్‌ చేయండి: స్టాలిన్‌

4 Mar, 2023 15:14 IST|Sakshi

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శనివారం ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులను రక్షస్తామని హామి ఇచ్చారు. వలస కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని, ఎవరైనా మిమ్మల్ని బెదరిస్తే హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేయండి అని చెప్పారు. తమిళనాడు ప్రభుత్వం, ప్రజలు, మా వలస సోదరులకు రక్షణా నిలుస్తారని అని స్టాలిన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే తమిళనాడు, బిహార్‌ అధికారులు వలస కార్మికులపై దాడుల గురించి అనవసరమైన పుకార్లు సృష్టించకుండా హెచ్చరికలు జారీ చేశారు.

ఈ పుకార్లే కార్మికులలో భయాందోళనలకు దారితీసిందని తెలిపారు. ప్రస్తుతం ఈ విషయమే బిహార్‌ అసెంబ్లీలో వాడివేడి చర్చలకు దారితీసింది. వలస కార్మికులను కలుసుకోవడం తోపాటు స్థానిక అధికారులను కూడా సంప్రదిస్తామని స్టాలిన్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి. బిహార్‌ నుంచి వలస వచ్చిన కార్మికులపై దాడులకు సంబంధించిన పుకార్లను తనిఖీ చేయడానికి ఇరు రాష్ట్రాల పోలీసులు సోషల్‌ మీడియాపై నిఘా పెట్టినట్లు తెలిపారు. అలాగే వలస కార్మికులను భయపడవద్దని తమిళనాడు జిల్లా కలెక్టర్లు హిందీలో విజ్ఞప్తి చేశారు.కాగా, బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఈ విషయమై అన్ని ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పైగా వారికి భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

(చదవండి: డ్రైవర్‌ లేకుండానే దానికదే హఠాత్తుగా స్టార్ట్‌ అయిన ట్రాక్టర్‌!ఆ తర్వాత..)

మరిన్ని వార్తలు