తేజస్వీ ఆన్‌డ్యూటీ... అర్థరాత్రి ఆకస్మిక తనిఖీ...వైద్యశాఖ అత్యవసర భేటీకి ఆదేశం

7 Sep, 2022 12:03 IST|Sakshi

పాట్నా: బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్‌ మెడికల్‌ కాలేజ్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సరిగ్గా అదే సమయానికి ఆస్పత్రి సీనియర్‌ అధికారి నిద్రకు ఉపక్రమించబోతున్నారు. ఇంతలో ఆరోగ్యమంత్రి తేజస్వీయాదవ్‌ ఆస్పత్రికి అకస్మాత్తుగా ఎంట్రీ ఇవ్వడంతో.. దెబ్బకు ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఆస్పత్రిలో అపరిశుభ్రత, రోగులకు సరైన మందులు అందుబాటులో లేకపోవడం, అపరిశుభ్రమైన మరుగుదొడ్లు తదితర అంశాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఒక్కరు కూడా ఈ ఆస్పత్రిలే నిలబడలేనంతగా వైద్య వ్యర్థాలు, చెత్తా పేరుకుపోయి ఉన్నాయన్నారు. ఆ ఆస్పత్రి పై మహిళలు, పలు రోగులు మంత్రికి ఫిర్యాదులు చేశారు. అంతేకాదు ఆస్పత్రిలో నర్సులే హెల్త్‌ మేనేజర్లుగా విధులు నిర్వర్తించడంపై ఆరా తీశారు. రాత్రి సమయాల్లో హెల్త్‌ మేనేజర్లు ఎందుకు విధులు నిర్వర్తించడం లేదని ప్రశ్నించారు.

ఆ తర్వాత వైద్యాధికారుతో సమావేశమై ఆస్పత్రిలోని పలు సమస్యలపై విచారించారు. అంతేకాదు ఈ ఆస్పత్రిలో రోగులకు ఎలాంటి సౌకర్యాలు అందడం లేదని, అధికారులంతా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోందన్నారు. తక్షణమై ఆస్పత్రి పై చర్యలు తీసుకుంటామని, సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని ప్రజలకు హామి ఇచ్చారు ఆరోగ్య మంత్రి  తేజస్వీయాదవ్‌. 

(చదవండి: కచ్చితంగా ఆరోజు కూడా వస్తుంది: బిహార్‌ సీఎం)

మరిన్ని వార్తలు