టుడే‌ హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు

21 Dec, 2020 08:57 IST|Sakshi

ఐదేళ్లలో ‘బంగారు బెంగాల్‌’
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలన పట్ల రాష్ట్ర ప్రజలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, వారు మార్పును కోరుకుంటున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఉద్ఘాటించారు. పూర్తి వివరాలు..

టీడీపీ మైండ్ గేమ్‌ ఆడుతుంది..

మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తున్నట్లు టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎలాంటి తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు..

నేపాల్‌ పార్లమెంటు రద్దు

అధికార పక్షంలోని ప్రత్యర్థులకు నేపాల్‌ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి ఊహించని షాక్‌ ఇచ్చారు. పార్లమెంటును రద్దు చేయాలని అధ్యక్షురాలు విద్యాదేవి భండారీకి సిఫారసు చేశారు. పూర్తి వివరాలు..

పతంజలి ‘కరోనిల్‌’తో ఉపయోగం నిల్‌

ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ స్థాపించిన పతంజలి ఆయుర్వేద సంస్థ తయారు చేసిన స్వసారి–కరోనిల్‌ కిట్‌ సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. ఈ ఔషధం కరోనాను తరిమికొడుతుందని, మహమ్మారి నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుందంటూ విస్తృతంగా ప్రచారం సాగింది. పూర్తి వివరాలు..

యూరప్‌ను వణికిస్తున్న కరోనా కొత్త రూపం

యూరప్‌ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి ఇప్పుడు మరో రూపం సంతరించుకుని మరింత తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ వైరస్‌ కొత్త రూపం 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందంటూ బ్రిటన్‌ ప్రభుత్వం ఆదివారం నుంచి కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. పూర్తి వివరాలు..

నేడు రిలే నిరాహార దీక్షలు 

వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులు సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాలు..

సీఎం జగన్‌కి ప్రధాని పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. సీఎం జగన్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాలు..

తెలంగాణకు 2,508 కోట్లు ఏపీకి 2,525 కోట్లు

సులభతర వాణిజ్యంలో నిర్దేశిత సంస్కరణలను అమలు చేసినందుకుగాను తెలంగాణ రూ. 2,508 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ రూ. 2,525 కోట్ల మేర బహిరంగ మార్కెట్‌ ద్వారా అదనపు రుణాలను సమీకరించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. పూర్తి వివరాలు..

బిగ్‌బాస్‌– 4 విజేత అభిజిత్‌

బుల్లితెర వీక్షకులను 106 రోజులపాటు అలరించిన ప్రముఖ తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌–4 గ్రాండ్‌ ఫినాలే ఆదివారం ముగిసింది. స్టార్‌ మా ప్రసారం చేసిన ఈ రియాలిటీ షో విజేతగా వర్ధమాన నటుడు, లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ చిత్రం ఫేమ్‌ అభిజిత్‌ నిలిచాడు. పూర్తి వివరాలు..

అమెజాన్‌ కోటీశ్వరులు 4,152 మంది

ఈ ఏడాది 1.5 లక్షల మంది వర్తకులు తమ వేదికపైకి కొత్తగా వచ్చారని ఈ–కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఆదివారం వెల్లడించింది. కోవిడ్‌–19 ఉన్నప్పటికీ ఇక్కడి విక్రేతలు విజయవంతం అయ్యారని తెలిపింది. పూర్తి వివరాలు..

మరిన్ని వార్తలు