ఇకపై ఒకేసారి రెండు డిగ్రీలు: యూజీసీ అనుమతి

13 Apr, 2022 08:34 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇకపై విద్యార్థులు ఒకేసారి రెండు ఫుల్‌టైమ్‌ డిగ్రీ కోర్సులు చేసేందుకు యూజీసీ అనుమతినిచ్చింది. దీనికి సంబంధించి త్వరలో నిబంధనలు జారీ చేస్తామని, ఈ అవకాశం 2022–23 విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తుందని యూజీసీ చైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ చెప్పారు. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా విద్యార్థులు ఒకేసారి బహుళ నైపుణ్యాలు ఆర్జించేందుకు వీలుగా ఒకేమారు రెండు డిగ్రీలు చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నామన్నారు. ఒకే విశ్వవిద్యాలయం లేదా వేర్వేరు విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీలు చేయవచ్చని చెప్పారు. 

చదవండి: (ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన పాక్‌ నూతన ప్రధాని)

మరిన్ని వార్తలు