కిడ్నాపైన ఓఎన్‌జీసీ ఉద్యోగి విడుదల

23 May, 2021 20:01 IST|Sakshi
మయన్మార్‌ సరిహద్దుల వద్ద పోలీసుల రక్షణలో రితుల్‌

గువాహటి: నిషేధిత ఉల్ఫా (ఐ) ఉగ్రసంస్థ  కిడ్నాప్‌ చేసిన ఓఎన్‌జీసీ ఉద్యోగిని శనివారం విడుదల చేసింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ విజ్ఞప్తి మేరకు ఉద్యోగి రితుల్‌ సైకియాను వారు విడిచిపెట్టారు. శనివారం ఉదయం మయన్మార్‌ సరిహద్దుల వద్ద వదిలిపెట్టారు. అనంతరం ఆర్మీ, పోలీసులు కలసి రితుల్‌ను రక్షించారు. దాదాపు నెల నుంచి ఆయన ఉగ్రవాదుల అదుపులోనే ఉన్నాడు.

దీంతో పూర్తిగా బక్కచిక్కి నీరసంగా ఉన్నాడని పోలీసులు చెప్పారు. గత నెల 21న ఓఎన్‌జీసీకి చెందిన ముగ్గురు ఉద్యోగులను ఉల్ఫా(ఐ) ఉగ్రసంస్థ కిడ్నాప్‌ చేసింది. అనంతరం జరిగిన ఓ ఎన్‌కౌంటర్లో ఇద్దరు ఉద్యోగులను బలగాలు రక్షించాయి. రితుల్‌ విడుదలను సీఎం హిమంత స్వాగతించారు. ఆయన్ను విడుదల చేయించేందుకు అవసరమైన మార్గదర్శకాన్ని అందించిన  హోం మంత్రి అమిత్‌షాకు ధన్యవాదాలు తెలిపారు. 

మరిన్ని వార్తలు