Pralhad Joshi Dance Video: కూతురు వివాహం: సతీమణితో కేంద్ర మంత్రి స్టెప్పులు

3 Sep, 2021 10:38 IST|Sakshi

బెంగళూరు: పెళ్లిలో మ్యూజిక్‌, డ్యాన్స్‌లు, ఎంజాయ్‌మెంట్‌ కామన్‌గా మారిపోయింది. వివాహ తంతు కంటే వీటి కోసమే ఎక్కువ ఆర్భాటాలు చేస్తున్నారు. పెళ్లికూతురు, పెళ్లికొడుకు, కుటుంబ సభ్యులు, బంధువులు ఇలా అందరూ ఏకమై ఆటపాటలతో చిందేస్తున్నారు. సాధారణ ప్రజలే కాకుండా సెలబ్రిటీలు, రాజకీయవేత్తలు సైతం ఇలాంటి వేడుకలకు సై అంటున్నారు. తాజాగా అలాంటి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి కుమార్తె వివాహం బుధవారం కర్ణాటకలో జరిగింది. ఈ వేడుకలో కేంద్ర మంత్రి ఓ పాటకు డ్యాన్స్‌ చేశారు.
చదవండి: అరుదైన సంఘటన.. ఏనుగుకు కవల పిల్లలు!

హుబ్లీలో జరిగిన ఈ ఫంక్షన్‌లో ఆయన సతీమణి జోత్యితో కలిసి ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేశారు. కన్నడ లెజెండ్ దివంగత రాజ్ కుమార్ పాడిన ‘ఏరాడు కనుసు’ సినిమాలోని సూపర్ హిట్ పాట ‘ఎండెందు నిన్నాను మారేటు నానిరాలారే’ కు జోషి దంపతులు డ్యాన్స్‌ చేశారు.  ఒకరి చేతిని ఒకరు పట్టుకొని తమదైన స్టెప్పులతో  అందరినీ అలరించారు. మంత్రి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు