టీమ్ ఇండియాగా పని చేయాలి!... మన జట్టుకు కెప్టెన్‌ మోదీ

26 Nov, 2021 20:49 IST|Sakshi

అహ్మదాబాద్‌: భారత్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో మనమంతా చేతులు కలపాలంటూ కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు మనం టీమ్ ఇండియాగా పని చేయాలని ఈ జట్టుకు కెప్టెన్ నరేంద్ర మోదీ అని అన్నారు.ఈ మేరకు నౌకాశ్రయాలు, షిప్పింగ్‌ల  జలమార్గాల మంత్రి  సోనోవాల్ గాంధీనగర్‌లోని మహాత్మా మందిరంలో జరుగుతున్న ప్రధానమంత్రి గతి శక్తి కార్యక్రమంలో మాట్లాడుతూ.. "మోదీ నాయకత్వంలో ప్రతి రంగం మార్పుని, అభివృద్ధిని చవిచూస్తోంది. భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా మార్చడానికి ఆయన నిబద్ధతతో పని చేస్తున్నారు. పైగా అందుకోసం కొన్ని లక్ష్యాలను కూడా నిర్దేశించుకున్నారు. మనమందరం కలిసి ఆ లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలి " అని అన్నారు.

(చదవండి: కరోనా కొత్త వేరియంట్‌.. జర్మనీలో తీవ్రరూపం..రంగంలోకి వైమానిక దళం)

అంతేకాదు మనమందరం నిబద్ధతతో మన బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉందని కూడా సోనోవాల్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు  గతి శక్తి కేవలం కనెక్టివిటీ మాత్రమే కాదు, దేశాన్ని బలోపేతం చేసేలా అన్ని రాష్ట్రాలను ఏకతాటిపైకి తీసుకువ్చే దిశగా సారిస్తున్న ముఖ్యమైన అడుగుగా అభివర్ణించారు.  అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సాకారం చేసేందుకు కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని సోనోవాల్‌ పేర్కొన్నారు. అంతేకాదు మోదీ నాయకత్వంలో ప్రతి వర్గానికి అవకాశాలను అందించారని అందువల్ల ప్రతి పౌరుడు ఈ గతి శక్తి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సోనోవాల్‌ అన్నారు.

ఈ క్రమంలో నౌకాశ్రయాలు, షిప్పింగ్ జలమార్గాల శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ మాట్లాడుతు.. "రెండు రవాణా మార్గాలను ఏకీకృతం చేయడం వల్ల వస్తువులను తరలించడంలో ఖర్చు తగ్గుతుంది. మల్టీమోడల్ కనెక్టివిటీని మంత్రిత్వ శాఖ కనెక్టివిటీ కీలక ప్రాంతంగా తీసుకుంది. అయితే ఇది పీఎం గతి శక్తి ప్రధాన ఇతివృత్తం. పైగా ఇక్కడ ప్రాజెక్ట్ నిర్వహణకు సంబంధించిన ప్రణాళిక అమలు, నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌లలో మార్పులను తీసుకురావాలని భావిస్తోంది. ఇప్పటి వరకు 500 కంటే ఎక్కువ ప్రాజెక్టులను మల్టీమోడల్ కనెక్టివిటీ ప్రాజెక్టులుగా చేపట్టింది. ఇది ఒక రకంగా ఉద్యోగాల కల్పనకు దోహదపడటమే కాక కొత్త వ్యాపార అవకాశాలతో ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పులను తీసుకురానుంది. అంతేకాదు మేము సాగరమాల కార్యక్రమంలో దాదాపు రూ.1.7 లక్షల కోట్లతో సుమారు 181 ప్రాజెక్టులను చేపడుతున్నాం. పైగా ఇందులో 19 రోడ్డు ప్రాజెక్టులు, 91 రైలు ప్రాజెక్టులు ఉన్నాయి." అని అన్నారు. 

ఈ మేరకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ మల్టీమోడల్ కనెక్టివిటీ సామర్థ్యాన్ని పెంచడం, ఖర్చును తగ్గించడమే కాక చివరికి ప్రపంచంలో స్థానిక ఉత్పత్తులను మరింత పోటీగా మార్చడంలో తమకు సహాయపడుతుందని  అన్నారు. అంతేకాదు ఈ చొరవ దేశంలో లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల ముఖచిత్రాన్ని మారుస్తుందని చెప్పారు. అయితే ఇది యువతకు కొత్త ఉద్యోగాలను సృష్టించడమేకాక ప్రపంచవ్యాప్తంగా స్థానిక ఉత్పత్తులను తీసుకువెళ్తోందంటూ భూపేంద్ర పటేల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

(చదవండి: పోలీస్‌ ఎగ్జామ్‌ రాసి వస్తున్న యువతిపై....ఫేస్‌బుక్‌ స్నేహితుడే అత్యాచారం)

మరిన్ని వార్తలు