ఏడాది కాలంలో దాదాపు 8 లక్షల వీసాల జారీ: డొనాల్డ్‌ హెఫ్లిన్‌

20 Apr, 2022 08:49 IST|Sakshi

చెన్నై: భారత్‌లో అమెరికా రాయబార కార్యాలయం వచ్చే 12 నెలల కాలంలో దాదాపు 8 లక్షల వీసాలను జారీ చేస్తుందని యూఎస్‌ ఎంబసీ అధికారి డొనాల్డ్‌ హెఫ్లిన్‌ చెప్పారు. వీసాల ప్రాసెసింగ్‌ కోసం పలు స్లాట్స్‌ ఆరంభించామన్నారు. కరోనాకుముందు ఏటా 12 లక్షల వీసాలను మంజూరు చేసేవాళ్లమని చెప్పారు.

2023–24 కల్లా తిరిగి ఆ స్థితి రావచ్చన్నారు. తమ కార్యాలయాల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచుతున్నామన్నారు. హైదరాబాద్‌లో కొత్త భవనాన్ని ఆరంభిస్తామని చెప్పారు. ఎఫ్‌ 1 వీసా కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తొలి యత్నంలో వీసా పొందలేకపోతే ఈ సంవత్సరమే రెండో దఫా ఇంటర్వ్యూ అవకాశం రాకపోవచ్చని చెప్పారు.

తొలి ఇంటర్వ్యూలో వీసా రానివారికి మిగిలిన ఇంటర్వ్యూల్లో వీసా వచ్చే అవకాశాలు కష్టమవుతాయన్నారు. ఈ ఏడాది మేలోనే స్టూడెంట్‌ వీసా ఇంటర్వ్యూలు ఆరంభిస్తామన్నారు. ఇంటర్వ్యూ మినహాయింపు ఇచ్చిన హెచ్, ఎల్‌ వీసా కేటగిరీల్లో స్లాట్లు ఆరంభమైనట్లు తెలిపారు.    

చదవండి: (పాల ఉత్పత్తిలో భారత్‌ టాప్‌: ప్రధాని మోదీ)

మరిన్ని వార్తలు