కొత్తతరహాలో పంట వ్యర్థాల డీకంపోజ్‌

2 Oct, 2020 10:06 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీ స‌హా  ఇరుగుపొరుగు రాష్ట్రాలైన హరియాణా, పంజాబ్, యూపీ, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో పంట కోత తర్వాత పొలంలో మిగిలిన పంట వ్యర్థాలను తగలబెట్టడంతో ఆయా రాష్ట్రాలు దట్టమైన కాలుష్యంతో నిండిపోయేవి. పూసా అగ్రికల్చర్‌ ఇనిస్టిట్యూట్ ఈ ఏడాది, మిగిలిన వ్యర్థాలను పొలాల్లోనే డీకొంపోజ్‌ చేయడానికి నూతన సాంకేతికతని అభివృద్ధిపరిచిందని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. ఈ ఐదు రాష్ట్రాల పర్యావరణ మంత్రులతో ఆయ‌న సమావేశం నిర్వహించారు, ఈ సీజన్‌లో మిగిలిపోయిన పంటవ్యర్థాలను తగులబెడితే వచ్చే కాలుష్యాన్ని ఎదుర్కొనే సంసిద్ధత గురించి ఈ సమావేశంలో చ‌ర్చించారు. గత మూడు సంవత్సరాలుగా వ్యర్థాల దహనం తగ్గినప్పటికీ ఈ సమస్యను పరిష్కరించడానికి మున్ముందు మ‌రిన్ని చ‌ర్య‌లు అవ‌స‌ర‌మ‌ని జవదేకర్‌ అన్నారు. ఈ వ్యర్థాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రూ.1,700 కోట్లు కేటాయించింది.వీటిలో  వ్యర్థాల అదుపు చేయడానికి ప్రస్తుతం, వ్యక్తులకు 50 శాతం, సహకార సంఘాలకు 80 శాతం ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు