లవ్‌ ఎఫైర్‌: వరుడి చెంప చెళ్లుమనిపించిన వధువు

23 Jun, 2021 10:26 IST|Sakshi

ఉ‍త్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న సంఘటన

లక్నో: ఈ మధ్యకాలంలో పెళ్లి మంటపాలు వైరల్‌ సంఘటనలకు వేదికలుగా మారుతున్నాయి. వీటికి సబంధించిన వీడియోలు, వార్తలు సోషల్‌మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటన మరొకటి వెలుగు చూసింది. పెళ్లి మంటపం నుంచి బయలుదేరిన వధువు అత్తారింట్లో అడుగుపెట్టకముందే అందరికి షాక్‌ ఇచ్చింది. వాకిట్లోనే అందరు చూస్తుండగా... వరుడి చెంప చెళ్లుమనిపించింది. ఆ తర్వాత చక్కా ఇంట్లోకి వెళ్లి.. పెళ్లి దుస్తులు మార్చుకుని.. అక్కడి నుంచి పుట్టింటికి వెళ్లిపోయింది. విషయం కాస్త ఊరంతా పాకడంతో ఇది కాస్త పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. ఆ వివరాలు..

ఈ అనూహ్య సంఘటన ఉత్తరప్రదేశ్‌ జౌన్‌పూర్‌ లవయాన్‌ గ్రామాంలో చోటు చేసుకుంది. వివాహం సదర్భంగా వరుడి తరఫు బందువులంతా పెళ్లి కుమార్తె ఇంటికి చేరుకున్నారు. అంగరంగ వైభవంగా ఎంతో సందడిగా వివాహ తంతు పూర్తయ్యింది. ఆ తర్వాత నూతన దంపతులిద్దరు కారులో పెళ్లి కుమారుడి ఇంటికి బయలుదేరారు. కారు నుంచి కిందకు దిగి.. అత్తింట్లో అడుగుపెట్టడానికి ముందు వధువు, అందరూ చూస్తుండగా తన భర్త చెంప చెళ్లుమనిపించింది. ఈ ఊహించని ఘటనకు అక్కడున్నవారంతా షాక్‌ అయ్యారు. దీన్ని నుంచి తేరుకునేలోపే కొత్త పెళ్లికూతురు లోపలికి వెళ్లి డ్రస్‌ మార్చుకుని.. చక్కా పుట్టింటికి వెళ్లింది. అక్కడ వారు రిసెప్షన్‌ వేడుకకు సిద్ధమవుతున్నారు. 

ఈలోపు ఈ వార్త కాస్త ఊరంతా పాకింది. దాంతో వరుడి కుటుంబ సభ్యులు పెళ్లి కుమార్తె ఇంటి వద్దకు వెళ్లి నిలదీశారు. ఈ క్రమంలో వివాదం కాస్త ముదరడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇక వారి దర్యాప్తులో తేలింది ఏంటంటే.. ప్రేమ వ్యవహారం కారణంగా ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది అన్నారు.

చదవండి: పెళ్లిలో ప్రత్యక్షమైన మాజీ ప్రియుడు.. తర్వాత సీన్‌ ఏంటంటే!

మరిన్ని వార్తలు