అంకిత హత్యపై... ‘ఫాస్ట్‌ట్రాక్‌’ విచారణ

26 Sep, 2022 05:46 IST|Sakshi

డెహ్రాడూన్‌/రిషికేశ్‌: రిషికేశ్‌లోని రిసార్టు రిసెప్షనిస్ట్‌ అంకితా భండారి(19)హత్యపై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ జరిపిస్తామని సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి ఆదివారం ప్రకటించారు. పోస్ట్‌మార్టం రిపోర్టు బయట పెడతామన్నారు. ఈ హామీ అనంతరం కుటుంబసభ్యులు అంకిత అంత్యక్రియలు పూర్తి చేశారు.

హత్యపై కీలక ఆధారాలు దొరికే అవకాశమున్న రిసార్ట్‌ను ప్రభుత్వం ఎందుకు కూల్చేసిందని అంకిత తండ్రి అంతకుముందు ప్రశ్నించారు. దోషులను శిక్షించాలంటూ రిషికేశ్‌–బద్రీనాథ్‌ జాతీయ రహదారిపై 8 గంటలు ఆందోళనజరిగింది. మరోవైపు హత్యను పక్కదారి పట్టించేందుకు నిందితుడు, మాజీ మంత్రి వినోద్‌ దకొడుకు పులకిత్‌ ప్రయత్నించినట్లు వెలుగులోకి వచ్చింది. వినోద్‌ మాత్రం తన కొడుకు అమాయకుడంటూ వెనకేసుకుని వచ్చారు.

మరిన్ని వార్తలు