ఎంతబాగా నటిస్తున్నావ్‌ రా బుడ్డోడా.. అదీ అసలు సంగతి!

19 Mar, 2021 19:41 IST|Sakshi

చిన్న పిల్లలు ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది. మురిపాల మూటలు కట్టే వారి చిరునవ్వులు చూస్తుంటే.. అల్లరి చేసినా సరే క్షమించేయాలనిపిస్తుంది. స్వచ్ఛమైన మనసు కలిగి ఉండే చిన్నారులను ప్రేమించని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఓ పిల్లాడి చేష్టలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బడిలో ప్రార్థన చేస్తున్న సమయంలో.. ‘‘మాకు శక్తిని ప్రసాదించూ’’ అంటూ గీతం పాడుతున్న ఆ బుడ్డోడు చేసిన పని నవ్వులు పూయిస్తోంది. ఎందుకంటే, ఆ పిల్లాడు అందరితో శృతి కలుపుతున్నాడే తప్ప, వాడి ధ్యాస మాత్రం లాలీపాప్‌ మీదే ఉంది. 

కళ్లు మూసుకున్నా సరే వీలు చిక్కినప్పుడల్లా లాలీపాప్‌ చప్పరిస్తూనే ఎంతో సిన్సియర్‌గా ప్రార్థనాగీతం ఆలపిస్తున్నట్లుగా పోజులిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్‌ చేసిన అవనీశ్‌ శరన్‌ అనే అధికారి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు‌. ‘‘మనలో చాలా మంది ఇలాగే చేసి ఉంటాం కదా’’ అన్న ఆయన కామెంట్‌కు స్పందనగా భిన్నమైన సమాధానాలు వస్తున్నాయి. చాలా మంది తమకు చిన్నతనంలో చేసిన అల్లరి గుర్తుకువస్తుందంటూ జ్ఞాపకాలు నెమరువేసుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓ లుక్కేయండి!

చదవండి: వ్వావ్‌! ఫ్రెండ్‌ షిప్‌ అంటే ఈ పిల్లులదే..

మరిన్ని వార్తలు