పెళ్లికి చీర కట్టుకుంటోంది.. అంతలోనే పాము!

15 Sep, 2020 18:54 IST|Sakshi

పామును కంటబడగానే ‘వామ్మో’ అంటూ పరుగులు తీసే వాళ్లను చాలా మందిని చూసే ఉంటాం. దాదాపుగా ప్రతీ ఒక్కరికి ఇలాంటి అనుభవం ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఉంటుంది. అయితే కర్ణాటకు చెందిన నిజారా చిట్టీ అనే మహిళ మాత్రం ఇందుకు మినహాయింపు. పాములను పట్టడమే కాదు, విష సర్పాలను కూడా లొంగదీసి వాటిని సురక్షితంగా జనావాసాల నుంచి పంపించేయగల నేర్పు, ధైర్యసాహసాలు ఆమె సొంతం. ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండానే చిట్టీ నాగుపామును పట్టిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. (చదవండి: పులి బ‌ల‌మేంటో మ‌రోసారి నిరూపించింది!)
(చదవండి: పులి బ‌ల‌మేంటో మ‌రోసారి నిరూపించింది!)

కర్ణాటకకు చెందిన నజారా చిట్టీ ఓరోజు పెళ్లికి వెళ్లేందుకు చీర కట్టుకుని ముస్తాబయ్యారు. అయితే అంతలోనే తమ ఇంట్లో నాగు పాము చొరబడిందని వచ్చి దాన్ని పట్టుకోవాలని ఓ వ్యక్తి ఫోన్‌ చేశారు. దీంతో అప్పటికప్పుడు అక్కడికి బయల్దేరిన చిట్టీ.. నాగుపామును ఎంతో ఒడుపుగా పట్టుకున్నారు. తోకను పట్టి ఆడిస్తూ ఇంట్లో నుంచి బయటకు తెచ్చి ఓ కవర్లో వేశారు. సురక్షితంగా సమీపలోని అడవిలో వదిలిపెట్టారు. ఈ ఘటన గతేడాది జరిగినప్పటికీ.. ఆ దృశ్యాలు మరోసారి నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. దీంతో చిట్టీ ధైర్యంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. హ్యాట్సాఫ్‌ అంటూనే, మరోసారి పామును పట్టుకునేపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా