మహిళల క్రూరత్వం, రోదిస్తున్నా వినకుండా..

30 Jun, 2021 21:26 IST|Sakshi

చండీగడ్‌: అక్కడ ఏం జరిగిందో తెలీదగానీ ఓ మూగజీవి పై మహిళలు వారి క్రూరత్వాన్ని ప్రదర్శించారు. చివరికి దాని ఆర్తనాదాలు కూడా వారి చెవినపడలేదు. ఈ ఘటన పంజాబ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పట్యాలా కి చెందిని ఇద్దరు మహిళలు క్రూరంగా ఓ కుక్కని వారి స్కూటీ వెనకాల కట్టి ఈడ్చుకెళ్లారు. ఆ జంతువు అరుస్తున్న కనీసం కనికరం కూడా లేకుండా దానీ అలా రోడ్డుపై కొంత దూరం లాక్కెళ్లి విడిచి పెట్టారు. దీని ఫలితంగా కుక్క తీవ్రంగా గాయపడింది. 

కాగా సమీపంలో కొందరు ఆ కుక్క దీనావస్థని చూసి వైద్యం చేయగా అప్పటికే తీ​వ్రంగా గాయలపాలవడంతో ఆ కుక్క మృతి చెందింది. ఈ ఘటన జూన్‌ 20న జరగగా, జున్‌ 24 మరణించింది. ఇదంతా పరిసరాల్లోని సీసీటీవిలో రికార్డ్‌ కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా తాజాగా ఈ వీడియో వైరల్‌ అయ్యింది. మరో వైపు జంతు ప్రేమికులు ఆ మహిళల క్రూరత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.  పోలీసులు కూడా స్పందించి వారిపై కేసు నమోదు చేశారు.  

చదవండి: దారుణం: నడిరోడ్డుపైనే ప్రాపర్టీ డీలర్‌ను..

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు