20 రోజులుగా తాగునీళ్లు లేవు

22 Apr, 2022 23:46 IST|Sakshi

బనశంకరి: బెంగళూరు దక్షిణ నియోజకవర్గపరిధిలోని ఉత్తరహళ్లి వార్డు (184) యాదాళం నగరలో గత 20 రోజులుగా తాగునీటిని సరఫరా కావడం లేదు. గుక్కెడు నీటికోసం తీవ్ర ఇక్కట్లు పడుతున్నామని  ప్రజలు వాపోయారు. గురువారం స్థానిక కాంగ్రెస్‌ నేత ఆర్‌కే.రమేశ్, ఉత్తరహళ్లి బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కే.కుమార్, శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో అక్కడ పర్యటించారు. ప్రజల సమస్యలను తీర్చడంలో ఎమ్మెల్యే ఎం.కృష్ణప్ప విఫలమయ్యారని కాంగ్రేస్‌నేతలు ఆరోపించారు. నేతలు బాలకృష్ణ, బైరప్ప, గుండుమణిశ్రీనివాస్, ఉమాదేవి పాల్గొన్నారు.   

 ఉమ్మడిగా సంక్షేమ కార్యక్రమాలు 
బనశంకరి: ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటరామరాజు గురువారం బెంగళూరు బనశంకరి గాయత్రిభవన్‌లో అఖిల కర్ణాటక బ్రాహ్మణ మహాసభ అధ్యక్షుడు అశోక్‌ హర్నహళ్లి, ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీధర్‌మూర్తిని కలిశారు. బ్రాహ్మణ సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించారు. ఇరు రాష్ట్రాల్లో ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.   

మరిన్ని వార్తలు