స్కై బస్సు సర్వీస్‌ అంటే ఏమిటి? రవాణాలో ఎంత సౌలభ్యం?

25 Oct, 2023 09:03 IST|Sakshi

భారతదేశంలో స్కై బస్సు రవాణా సౌకర్యంపై మరోమారు చర్చ మొదలైంది. దేశంలో స్కై బస్సు వ్యవస్థను త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. భారత్‌లో స్కై బస్సు సర్వీస్‌ ప్రారంభమైతే పలునగరాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. స్కై బస్సు సర్వీసుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

స్కై బస్సు అనేది మెట్రో మాదిరిగానే చౌకైన, పర్యావరణ అనుకూల పట్టణ ప్రజా రవాణా వ్యవస్థ. ఇది ఎలివేటెడ్ ట్రాక్‌ను కలిగి ఉంటుంది. స్కై బస్సులు సుమారుగా గంటకు వంద కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. ఇవి విద్యుత్‌ శక్తితో నడుస్తాయి. వీటి నిర్వహణకు మెట్రో కంటే తక్కువ ఖర్చు అవుతుంది. స్కై బస్ అనేది విలోమ కాన్ఫిగరేషన్ వాహనం. దీని చక్రాలు, ట్రాక్‌లు ఒక మూసివున్న కాంక్రీట్ బాక్స్‌ మధ్య అమరి ఉంటాయి. ఈ వ్యవస్థలో పట్టాలు తప్పడం లాంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. 

మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి 2003లో నూతన సంవత్సర కానుకగా గోవాకు స్కై బస్సు ప్రాజెక్టును ప్రకటించారు. రూ.100 కోట్లతో ఖర్చుతో కూడిన ఈ ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. మొదటి దశ కింద పైలట్ ప్రాజెక్ట్ మపుసా నుండి పనాజీకి అనుసంధానించాలనుకున్నారు. దీని ప్రారంభ మార్గం 10.5 కి.మీ. అయితే 2016లో కొంకణ్ రైల్వే కార్పొరేషన్ స్కై బస్ ప్రాజెక్ట్‌ను రద్దు చేసింది. ఆ సమయంలో అది లాభదాయకం కాదని, ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. 
ఇది కూడా చదవండి: ‘అగ్నివీర్‌’ అమరుడైతే ఆర్థిక సాయం అందదా? ఇండియన్‌ ఆర్మీ ఏమంటోంది?

మరిన్ని వార్తలు