World Population Day Special: చైనా కాదు త్వరలో భారత్‌ నెం.1: యూఎన్‌ నివేదిక

11 Jul, 2022 18:59 IST|Sakshi

వచ్చే ఏడాది నాటికి చైనాను అధిగమించి భారత్‌ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించనుందట. ఈ మేరకు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి నివేదిక విడుదల చేసింది. యునైటెడ్ నేషన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ ఏమంటోందంటే.. ప్రపంచ జనాభా నవంబర్ మధ్య నాటికి ఎనిమిది బిలియన్లకు చేరుకుంటుందని, దీంతో పాటు 2030లో దాదాపు 8.5 బిలియన్లుగా, 2050లో 9.7 బిలియన్లకు చేరుతుందని అంచనా వేసింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చాలా తక్కువ సంఖ్యలో జనాభా పెరుగుతున్నట్లు నివేదికలో వెల్లడించింది. 

నివేదికలోని కొన్ని కీలకమైన విషయాలు:
►2023నాటికి చైనాను భారత్ అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారునుందని అంచనా వేసింది.
►2050 వరకు అంచనా ప్రకారం.. ప్రపంచ జనాభాలో సగానికి పైగా జనాభా కేవలం ఎనిమిది దేశాలలో ఉండనున్నట్లు తెలిపింది. (అందులో భారత్‌ కూడా ఒకటి)
►ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ ఆసియా, ఓషియానియాలోని జనాభా ఈ శతాబ్దం చివరి నాటికి పెరుగుదల నెమ్మదిగా ఉండనున్నట్లు భావిస్తున్నట్లు పేర్కొంది.
►2010-2021 నుంచి వలసదారుల నికర ప్రవాహం 1 మిలియన్ దాటిన 10 దేశాలలో ఉన్నాయని తెలపగా, అందులో భారతదేశం కూడా ఉంది.
►సిరియా, వెనిజులా, మయన్మార్ వంటి దేశాలు అభద్రత, సంఘర్షణ కారణాల వల్ల అక్కడ నుంచి వలసలు పెరుగుతున్నట్లు వెల్లడించింది.
►ఎక్కువగా కోవిడ్-19 మహమ్మారి ప్రభావం కారణంగా ప్రపంచ ఆయుర్దాయం 2019లో 72.8 నుంచి 2021లో 71.0 సంవత్సరాలకు పడిపోయిందని తెలిపింది.
►తక్కువ అభివృద్ధి చెందిన 46 దేశాలు జనాభా పరంగా.. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్నట్లు పేర్కొన్నారు.  2022 నుంచి 2050 మధ్య చాలా వరకు జనాభా రెట్టింపు అవుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు.

చదవండి: ఆకాశంలోకి ఎగిరే జలపాతాన్ని ఎప్పుడైనా చూశారా?

మరిన్ని వార్తలు