సంక్షిప్తం

10 Nov, 2023 05:00 IST|Sakshi

బ్యాంక్‌ సేవలపై అవగాహన

నిజామాబాద్‌ సిటీ: తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ పాంగ్రా శాఖ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలపై బ్యాంక్‌ రీజినల్‌ మేనేజర్‌ పురం నవీన్‌కుమార్‌, బ్యాంక్‌ మేనేజర్‌ ఉమారాణిలు, ఉద్యోగులు గురువారం ప్రజలకు అవగాహన కల్పించారు. వినాయక్‌నగర్‌ తెలంగాణ అమరవీరుల పార్కులో వాకర్స్‌కు డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేట్లు, రుణాలపై అవగాహన కల్పించారు.

‘కాంగ్రెస్‌ మైనారిటీ డిక్లరేషన్‌’ హర్షణీయం

ఖలీల్‌వాడి: కాంగ్రెస్‌ మైనారిటీ డిక్లరేషన్‌లో ముల్లాలతోపా టు పాస్టర్లు, సిక్కు గ్రంథికులకు జీతాల అంశాన్ని చేర్చడం హర్షణీయమని మైనార్టీ నేత సయ్యద్‌ కై సర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రానికి మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ ఎమ్మె ల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వచ్చిన సమయంలో వినతిపత్రం అందించామన్నారు. దీంతో పాస్టర్లు, సిక్కు గ్రంథికులకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు.

విద్యార్థి అమరవీరుల వర్ధంతి సభ

ధర్పల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థి అమరవీరుల వర్ధంతి సభ నిర్వహించారు. విద్యార్థుల సమస్యలపై పోరాడి అసువులు బాసిన విద్యార్థి అమరవీరులకు నివాళులు అర్పించారు. సీపీఐఎంఎల్‌ డివిజన్‌ కార్యదర్శి రమేష్‌, వెంకట కిషన్‌, నరేందర్‌, రాజేశ్వర్‌, సాయి రెడ్డి పాల్గొన్నారు.

క్యాన్సర్‌పై అవగాహన సదస్సు

మోపాల్‌: మండలంలోని బాడ్సి గ్రామంలో గురువారం సూర్య ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు క్యాన్సర్‌ నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముదక్‌పల్లి పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ ఆశిష్‌ సదస్సులో పాల్గొని, మాట్లాడారు. క్యాన్సర్‌ వ్యాధికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లక్షణాలు, తదితర విషయాలను వివరించారు. సంస్థ ప్రతినిధులు రాజేంద్ర కుమార్‌, విక్రమ్‌, వినోద్‌, పాల్గొన్నారు.

పోరాట ఫలితమే ఫీజుల తగ్గింపు

ఖలీల్‌వాడి: విద్యార్థుల ఉద్యమం ఫలితంగానే గిరిరాజ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామ్మోహన్‌రెడ్డి పరీక్ష ఫీజులు తగ్గించారని పీడీఎస్‌యు నగర అధ్యక్షుడు ఎస్కే అషూర్‌ తెలిపారు. నగరంలోని గిరిరాజ్‌ కళాశాల ఎదుట గురువారం ఆయన మాట్లాడారు. నాయకులు సలీం, మంగ, నాగేష్‌, నజీర్‌, నయుం, సందీప్‌, వినోద్‌, ప్రదీప్‌ పాల్గొన్నారు. నామినేషన్‌ కార్యక్రమానికి తరలిరండి

సిరికొండ: నిజామాబాద్‌ రూరల్‌ బీజేపీ అభ్యర్థి కులాచారి దినేష్‌ కుమార్‌ శుక్రవారం జిల్లాకేంద్రంలో నామినేషన్‌ వేయనున్నట్లు పార్టీ మండలాధ్యక్షుడు అల్లూరి రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈసందర్భంగా నేడు జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న నామినేషన్‌ ర్యాలీకి పార్టీ శ్రేణులు భారీగా తరలి రావాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.

మరిన్ని వార్తలు