ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

18 Nov, 2023 01:22 IST|Sakshi
ఈవీఎంల కేటాయింపు..

సుభాష్‌నగర్‌ : జిల్లాలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. 30న పోలింగ్‌ ఉండటంతో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇదివరకే తుది ఓటరు జాబితా విడుదల చేయగా, ఇటీవల అనుబంధ ఓటరు జాబితాను ప్రకటించారు. ఈ సందర్భంగా పోలింగ్‌ నిర్వహణకు అవసరమైన ఈవీఎంల ర్యాండమైజేషన్‌ శనివారం చేపట్టనున్నారు. మొదటి విడత ర్యాండమైజేషన్‌ గతనెల 20న చేపట్టారు. ఈవీఎంలను నియోజకవర్గ కేంద్రాల్లోని స్ట్రాంగ్‌రూంలలో భద్రపర్చారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాలైన ఆర్మూర్‌, బోధన్‌, బాన్సువాడ, అర్బన్‌, రూరల్‌, బాల్కొండ నియోజకవర్గాల్లో 1,549 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా బ్యాలెట్‌ యూనిట్లు 2,295 (25శాతం అదనం), కంట్రోల్‌ యూనిట్లు 1,934 (25శాతం అదనం), వీవీ ప్యాట్లు 2,169 (40శాతం అదనం) కేటాయించారు.

రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో..

శనివారం రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో యంత్రాల ర్యాండమైజేషన్‌ నిర్వహించనున్నారు. ప్రక్రియ మొత్తం కంప్యూటర్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఈవీఎంలను పోలింగ్‌ కేంద్రాలకు కేటాయిస్తారు. నెంబర్ల ప్రకారం ఏ పోలింగ్‌ కేంద్రాలకు కేటాయించబడుతుందో అధికారులు పార్టీల ప్రతినిధులకు వివరిస్తారు. ఇలా కేటాయించిన ఈవీఎంలను పోలింగ్‌ సిబ్బంది ఓటింగ్‌కు ఒకరోజు ముందు (29న) పోలింగ్‌ కేంద్రాలకు తీసుకెళ్తారు.

నేడు రెండో విడత ఈవీఎం

ర్యాండమైజేషన్‌

6,395 యంత్రాల కేటాయింపు

మరిన్ని వార్తలు