ఆస్ట్రేలియా ఇన్వెస్టర్స్‌ వెల్‌కమ్‌ టూ తెలంగాణ

30 May, 2022 20:55 IST|Sakshi

చెన్నై: ఇండియాలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. చెన్నైలో ఆస్ట్రేలియా కాన్సులేట్‌ జనరల్‌ నిర్వహించిన యాన్‌ అప్‌డేట్‌ టూ యాన్‌ ఇండియన్‌ ఎకనామిక్‌ స్ట్రాటజీ 2035లో ఆయన ప్రసంగించారు. ఇండియా అనేక విభిన్నతల సమాహారమన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంత అవసరమో రాష్ట్ర ప్రభుత్వాలది అనే అంతే నొక్కి చెప్పారు.

టీ ఐపాస్‌
అనేక దేశాల్లో ఇన్వెస్టర్లకు ఇబ్బందికరంగా మారిన రెడ్‌టేపిజానికి అంతం చేసేందుకు ఇండియాలోనే తొలిసారిగా టీ ఐపాస్‌ను (తెలంగాణ ఇండస్ట్రియల్‌ పాలసీ) అమల్లోకి తెచ్చామన్నారు. దీని వల్ల గడిచిన ఎనిమిదేళ్లలో 19 వేల పరిశ్రమలకు అనుమతులు జారీ చేయగా రికార్డు స్థాయిలో 35 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 16 లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు. తెలంగాణలో అమలవుతున్న పారిశ్రామిక విధానం బాగుండటం వల్ల తమకు వస్తున్న పెట్టుబడుల్లో 24 శాతం రిపీట్‌ అవుతున్నవే ఉన్నాయని వెల్లడించారు. ఇక్కడ పెట​‍్టుబడులు పెడుతున్నవారే తమకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారుతున్నారంటూ కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌
నైపుణ్యంతో కూడిన మానవ వనరులను తయారు చేసేందుకు  ప్రపంచ స్థాయి విద్యాసంస్థలతో తెలంగాణకు చెందిన విద్యాసంస్థలు కలిసి పని చేసేలా వ్యూహం రూపొందిస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. యూకేతో పాటు ఇటీవల దావోస్‌లో జరిగిన సమావేశంలో ప్రఖ్యాత విద్యా సంస​‍్థలతో చర్చలు జరిగాయని ఆయన అన్నారు. ఇప్పుడు తమతో కలిసి పని చేయాలంటూ ఆస్ట్రేలియాకు సైతం విజ్ఞప్తి చేస్తున్నట్టు కేటీఆర్‌ వివరించారు. దేశంలో యూఎస్‌కు ఎక్కువగా హైదరాబాద్‌ నుంచే వెళ్తున్నారని కేటీఆర్‌ తెలిపారు. ఆ తర్వాత యూకే , ఆస్ట్రేలియాలు ఉన్నాయన్నారు. త్వరలో హైదరాబాద్‌లోనూ ఆస్ట్రేలియా కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి కేటీఆర్‌ చేశారు. 

చదవండి: స్టార్టప్‌లు జాగ్రత్త! పునాదులు కదులుతున్నాయ్‌!

మరిన్ని వార్తలు