టపాసుల విక్రయాలకు అనుమతులు తప్పనిసరి

12 Nov, 2023 01:50 IST|Sakshi

రేంజ్‌ ఐజీ పాలరాజు

నగరంపాలెం: గుంటూరు జిల్లాలో లైసెన్స్‌ లేకుండా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని గుంటూరు రేంజ్‌ ఐ.జి., జిల్లా ఇన్‌చార్జ్జి ఎస్పీ జి.పాలరాజు శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. టపాసులు విక్రయించే ప్రాంతాల్లోనూ జాగ్రత్తలు పాటించకపోయిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో బాణ సంచా విక్రయాల లైసెన్సు పొందిన దుకాణాల్లోనే ప్రభుత్వ నిబంధలనకు అనుగుణంగా బాణసంచా విక్రయించాలని తెలిపారు. అదే విధంగా బాణాసంచా లైసెన్సుదారులు బహిరంగ ప్రదేశాల్లో నిర్ణీత కొలతలప్రకారం దుకాణాలు ఏర్పాటు చేయాలన్నారు. నీరు, ఇసుక, అగ్నిమాపక సామగ్రిని సిద్ధంగా ఉంచాలని తెలిపారు. లైసెన్సుల్లేకుండా టపాసులు తయారీ, నిల్వ చేసి విక్రయించిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో బాణసంచా అక్రమ విక్రయాలు, నిల్వల సమాచారం ఉన్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గుంటూరు రేంజ్‌ పరిధిలో పోలీస్‌ అధికారులు, సిబ్బందికి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు