అఖిలప్రియ ధిక్కార స్వరం

6 Apr, 2021 05:21 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి అఖిలప్రియ

పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు

ఆళ్లగడ్డ: పరిషత్‌ ఎన్నికల్లో పాల్గొనరాదని టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి అఖిలప్రియ ధిక్కారస్వరాన్ని వినిపించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పరిషత్‌ ఎన్నికల్లో బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థులు విజయం కోసం ప్రయత్నించాలని సూచించారు. సోమవారం ఆమె ఆళ్లగడ్డలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

నియోజకవర్గంలో ఎక్కడా పరిషత్‌ ఎన్నికలను బాయ్‌కాట్‌ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆరు మండలాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని చెప్పారు.  వారి తరఫున  ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థిస్తామని తెలిపారు. పోటీలో టీడీపీ అభ్యర్థులు లేని చోట, అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన స్థానాల్లో సైకిల్‌ గుర్తుకు బదులు నోటాకు ఓటు వేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. 

మరిన్ని వార్తలు