ఢిల్లీలో అఖిలపక్ష భేటీ.. హజరైన విజయసాయి రెడ్డి

17 Sep, 2023 18:21 IST|Sakshi

ఢిల్లీ: రేపు ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ముందు నేడు కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో నేడు అల్ పార్టీ మీటింగ్ జరిగింది. అన్ని పార్టీల నేతలు, ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. YSRCP తరుపున విజయసాయిరెడ్డి హాజరయ్యారు.  

పార్లమెంట్‌లో రేపు ప్రారంభం కానున్న ప్రత్యేక సమావేశాల్లో చర్చించాల్సిన అంశాల గురించి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. స్పెషల్ సెషన్ అజెండాపై చర్చించారు. సమావేశాలకు సహకరించాలని అన్ని పార్టీల నాయకుల్ని కోరారు.  

ఈ నెల 18న 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయాణం పై చర్చ జరగనుంది. రాజ్యసభలో రెండు, లోక్‌సభలో రెండు బిల్లుపై చర్చ జరగనున్నట్లు ఆయా బులిటెన్లు పేర్కొన్నాయి. రాజ్యసభలో.. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లు, ది పోస్ట్ ఆఫీస్ బిల్లు, అలాగే లోక్‌సభలో అడ్వకేట్స్ యాక్ట్ సవరణ బిల్లు, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ బిల్లులపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: మాధవన్ పోస్టుకు ప్రధాని మోదీ స్పందన

మరిన్ని వార్తలు