బద్వేలులో 18 నామినేషన్ల ఆమోదం 

12 Oct, 2021 04:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బద్వేలు అర్బన్‌: వైఎస్సార్‌ జిల్లా బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు దాఖలైన నామినేషన్లను నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కేతన్‌గార్గ్‌ సోమవారం పరిశీలించారు. వివిధ పార్టీలకు చెందిన వారితోపాటు స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 27 మంది 35 నామినేషన్లు దాఖలు చేశారు.

అసంపూర్తి వివరాలు, అవసరమైన పత్రాలు సమర్పించకపోవడం వంటి కారణాలతో వీటిలో 9 మంది నామినేషన్లను తిరస్కరించారు. వైఎస్సార్‌సీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులతో సహా మొత్తం 18 నామినేషన్లను ఆమోదించినట్లు రిటర్నింగ్‌ అధికారి తెలిపారు.  ఉపసంహరణకు బుధవారం సాయంత్రం వరకు గడువుంది.   

మరిన్ని వార్తలు