బీసీల జనగణన కోసం చలో ఢిల్లీ 

26 Nov, 2021 04:16 IST|Sakshi

13 నుంచి 15 వరకు: జాజుల

పంజగుట్ట: బీసీ జనగణనతో పాటు కుల గణన చేయాలనే డిమాండ్‌తో డిసెంబర్‌ 13 నుంచి 15 వరకు ‘బీసీల చలో ఢిల్లీ’కార్యక్రమం నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ పేర్కొన్నారు. 13న బీసీల జంగ్‌ సైరన్, 14న పార్లమెంట్‌ ముట్టడి, 15న జాతీయ స్థాయి అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. బీసీ జనగణన చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా ప్రశ్నించనందున తాడో పేడో తేల్చుకునేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చలో ఢిల్లీ పోస్టర్‌ ఆవిష్కరించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు 9 రాష్ట్రాల ప్రభుత్వాలు బీసీల జనగణన జరగాలని అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపాయని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాపురం పద్మ, మణిమంజరి, నర్సింహా నాయక్, శ్రీనివాస్‌ గౌడ్, మాదాసి రాజేందర్, స్వర్ణ, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు