దమ్ములేనిది కేసీఆర్‌ బానిసలకే: ఈటల

28 Jan, 2023 07:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ‘సీఎం కేసీఆర్‌ బానిసలు, ఆయన సంధించిన సైకో శాడిస్టులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కళ్ళు నెత్తికెక్కి, అహంకారంతో బలుపెక్కి దమ్ముందా అని మాకు చాలెంజ్‌ చేస్తున్నారు ... దమ్ములేనందునే వాళ్లు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు’ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

బీజేపీ నేతలు ఏనుగు రవీందర్‌ రెడ్డి, తుర్క నరసింహులుతో కలిసి శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో ఈటల  మీడియాతో మాట్లాడారు. తమపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడినంత మాత్రాన తమ ధైర్యం ఏమాత్రం దెబ్బతినదని.. వారి మాటలను మరింత స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు క్షేత్రస్థాయిలో ఇంకా దూకుడుగా కొట్లాడ తామన్నారు. ఈ దేశంలో తెలంగాణ భాగం కాదు ఒక ప్రత్యేక దేశం అన్నట్లుగా కేసీఆర్‌ వ్యవహరి స్తున్న తీరు ఏమాత్రం మంచిది కాదన్నారు. 

గవర్నర్‌తో వ్యవహరించిన తీరు జుగుప్సాకరం
‘ఈ జనవరి 26న  కేసీఆర్‌  రాజ్యాంగం పట్ల వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్‌ను అవమానపరచడం అంటే రాజ్యాంగాన్ని మహిళలను అవమానపరచడమే’ అని ఈటల అన్నారు.
చదవండి: మంత్రి కేటీఆర్‌కు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సవాల్‌

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు