చంద్రబాబుపై జీవీఎల్‌ ఫైర్‌.. చేసిన తప్పులు ఒప్పుకోవాలని డిమాండ్‌

20 Oct, 2021 18:37 IST|Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు ఫైర్‌ అయ్యారు. గతంలో చంద్రబాబు ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిస్థితులపై కేంద్రం జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరడంపై జీవియల్‌ మండిపడ్డారు. కేంద్రానికి రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదని గతంలో చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. గతంలో చేసిన తప్పులను చంద్రబాబు ఒప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. 
చదవండి: సీఎం జగన్‌ను చంద్రబాబు ఇంచుకూడా కదపలేరు: కొడాలి నాని

మరిన్ని వార్తలు