ఐదేళ్లలో ఏం చర్యలు తీసుకున్నారు?

27 Oct, 2020 03:15 IST|Sakshi

గీతంపై చంద్రబాబుకు మంత్రి బొత్స సూటి ప్రశ్న 

సాక్షి, విశాఖపట్నం: గీతం విద్యా సంస్థల ఆక్రమిత భూముల్ని ప్రభుత్వం స్వాదీనం చేసుకోవడాన్ని ప్రజలందరూ హర్షిస్తుంటే చంద్రబాబు మాత్రం ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. విశాఖలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు గీతం గుప్పిట్లో ఉన్నాయని అధికారులు నివేదికలిచ్చినప్పుడు చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అలా అని.. ఎందుకు గీతం సంస్థలకు బదలాయించలేదో ప్రజలకు చంద్రబాబు బహిర్గతంగా చెప్పగలరా? అని బొత్స ప్రశ్నించారు.  ప్రభుత్వ స్థలాల్ని దోచుకున్న వారిని వెనకేసుకొస్తూ నీచరాజకీయాలు మానుకోవాలని చంద్రబాబుకు సూచించారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు