లాలూ సారథ్యంలో రాహుల్ గాంధీ మటన్ కర్రీ తయారీ.. రాజకీయాల్లో చిట్కాలపై చర్చ..

3 Sep, 2023 09:23 IST|Sakshi

పాట్నా: బిహార్‌లో ప్రసిద్ధి చెందిన 'చంపారన్ మటన్' ను ఏవిధంగా వండించాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లాలూ ప్రసాద్ యాదవ్ నేర్పించారు. లాలూ సూచనలు ఇస్తుండగా.. రాహుల్ మటన్‌ కర్రీని వండారు. ఈ వీడియోను రాహల్ తన ట్విట్టర్(ఎక్స్) లో షేర్ చేశారు. 

'నాకు వంట చేయడం వచ్చు. కానీ పూర్తి నైపుణ్యం లేదు. యూరప్‌లో ఉండేప్పుడు ఒంటరిగా ఉండేవాన్ని. ఆ క్రమంలో వండటం నేర్చుకున్నాను. కొన్ని ప్రాథమిక వంటలు చేస్తాను.' అని రాహుల్ గాంధీ ట్విట్టర్ లో తెలుపుతూ.. నేడు లాలూ యాదవ్ నేతృత్వంలో మంచి వంటకాన్ని వండాను అని రాసుకొచ్చారు. 

మటన్‌ వండే క్రమంలో నేతలిద్దరు ముచ్చటించుకున్నారు. వంట వండటం ఎప్పుడు నేర్చుకున్నారని రాహుల్ అడిగిన ప్రశ్నకు లాలూ సమాధానమిచ్చారు. ' 7వ తరగతి చదివే క్రమంలో నేను అన్నయ్యల వద్దకు పాట్నా వెళ్లాను. అక్కడ వారు ఉద్యోగం చేసేవారు. అక్కడే వారికి వండిపెట్టేవాడిని. కట్టెలు ఎలా సమకూర్చుకోవాలి..? వంట పాత్రలు ఎలా శుభ్రపరుచుకోవాలి..? మసాలాలు ఎలా రుబ్బుకోవాలో? నేర్చుకున్నాను.' అని లాలూ చెప్పారు. 

ఏడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో లాలూ.. రాహల్‌కు మటన్ ఎలా చేయాలో నేర్పించారు. మసాలాలతో సహా అన్ని రకాలను ఎలా కలపాలో చెప్పారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య రాజకీయాలపై ఆసక్తికర ప్రశ్నోత్తరాల చర్చ సాగింది.

రాహుల్: రాజకీయాల్లో సీక్రెట్ మసాలాలు ఎంటి?
లాలూ: కష్టపడి పనిచేయడమే, అన్నాయానికి వ్యతిరేకంగా పోరాడాలి.

రాహుల్: మటన్ కర్రీని తయారు చేయడం.. రాజకీయాలు రెండింటి మధ్య తేడా ఏంటి? నాకు అన్ని కలపడం ఇష్టం..
లాలూ:  అవును, కొంచమైనా కలపకుండా రాజకీయాలు చేయలేం. నాకూ రాజకీయం అంటే ఇష్టం.

రాహుల్: మాలాంటి వచ్చే తరానికి మీరిచ్చే సలహా ఏంటీ?
లాలూ: మీ పూర్వికులు ఈ దేశాన్ని కొత్త మార్గంలో నడిపించారు. ధర్మాన్ని కాపాడారు. మీరు దాన్ని మరిచిపోకూడదు.

మటన్ కర్రీ తయారు చేసేప్పుడు బిహార్ డిప్యూటీ చీఫ్ తేజస్వీ యాదవ్, ఆయన సోదరి మిసా భారతి అక్కడే ఉన్నారు. వంట పూర్తి అయిన తర్వాత డైనింగ్ టేబుల్‌ వద్దకు అందరూ రావడాన్ని గమనించవచ్చు. ఆ తర్వాత రాహుల్ ఆ మటన్ కర్రీని తన సోదరి ప్రియాంకకు కూడా ప్యాక్ చేసుకుని తీసుకువెళ్లారు. 

ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు..

మరిన్ని వార్తలు